Congress: జీవన్ రెడ్డిపై వేటు..రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం ?

Congress
Congress

Congress: జగిత్యాల జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జగిత్యాల జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నార‌ట‌. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ మనుషులకి బీ ఫారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. Congress

Jeevan Reddy dismissal Revanth Reddy Congress decision is shocking

ఈ త‌రుణంలోనే, తన అనుచరులకు బీ ఫారం ఇవ్వకుండా మోసం చేశారని, తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓడించడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తోంద‌ట‌ అధిష్ఠానం. వర్గపోరు వల్ల ఒకరి అనుచరులను ఇంకొకరు ఓడించడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అధిష్ఠానం ఆందోళన వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Congress

Also Read: Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

మరోవైపు గద్వాల, మహబూబాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయట ప‌డింది. రెబల్ అభ్యర్థుల బలం ముందు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నార‌ట‌. దీంతో జగిత్యాలతో పాటు వర్గపోరు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌చార్జి మంత్రులకు ఆదేశాలు ఇచ్చార‌ట‌ రేవంత్ రెడ్డి. Congress

Also Read: Nandamuri Balakrishna: బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం

Share your love