Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జ‌గిత్యాల కాంగ్రెస్ లో క‌ల్లోలం ?

Jagtial Congress
Jagtial Congress

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం చోటుచేసుకుంది. గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకల్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలియకుండానే సంజయ్ కుమార్ కు కండువా కప్పారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అప్పటినుంచి రేవంత్ రెడ్డి తో పాటు సంజయ్ ని టార్గెట్ చేసి ఒరిజినల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. Jagtial Congress

Jagtial Congress Sanjay Kumar VS Jeevan Reddy

తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పరువు తీసేలా మాట్లాడినారు జీవన్ రెడ్డి. సంజయ్ ఎవడవిరా నువ్వు ? మా పార్టీలోకి వచ్చి పెత్తనంచెలాయిస్తావా ? అంటూ నిలదీశారు. మీ అంతు చూస్తానంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు జీవన్ రెడ్డి. గులాబీ పార్టీలో గెలిచిన సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిన సంగతి తెలిసిందే. Jagtial Congress

Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైనా పదవులు రావాలంటే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ నేతలు కలవాల్సిన పరిస్థితి నెలకొంది. జీవన్ రెడ్డి తరఫు నాయకులకు పదవులు ఇవ్వాలని ఎన్నో ప్రతిపాదనలు పంపినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదట. దీంతో జీవన్ రెడ్డి కాస్త సంతృప్తిగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు వీళ్ళ వివాదం ఇలాగే కొనసాగితే జగిత్యాల రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతాయి. Jagtial Congress

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Share your love