

KERALA ELECTIONS: కేరళ ఎన్నికలకు తెలంగాణ నుంచి రూ.10000 కోట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి నిధులు సమకూర్చాలని ఢిల్లీ భేటీలో రేవంత్ రెడ్డి, మంత్రులకు రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కేరళ ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్క మంత్రి రూ.50 కోట్ల పైనే సేకరించాలని టార్గెట్ విధించినట్టు సమాచారం.
Congress leadership ordered to give Rs.1000 crores for Kerala elections
దాదాపు రూ.800 నుంచి రూ.1000 కోట్లు అవసరం అవుతాయని కాంగ్రెస్ పెద్దలు తేల్చేశారు. కేరళ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కీలక కాంగ్రెస్ నాయకులతో అధిష్టాలను భేటీ అయ్యారని సమాచారం. కేరళ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ని నిర్ణయించారు. ఇప్పటికే కేరళలో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఛానల్ ని కేరళలో మొదలుపెట్టారు.
Also Read : Cable Bridge : కేబుల్ బ్రిడ్జ్ లైట్లు దొంగల పాలు..!
కర్ణాటక గ్రూపు రాజకీయాలతో నిధులు కష్టమని.. తెలంగాణ పై కన్నేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ ప్రజాధనాన్ని ఎన్నికల ఖర్చు కోసం ఏటీఎం మాదిరిగా రాహుల్ గాంధీ వాడేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న మహారాష్ట్ర, నిన్న బీహార్, నేడు కేరళ.. ఎన్నికలు ఏవైనా తెలంగాణ ఖజానా కే గండి కొడుతున్నారని వార్తలు వినిపించడం విశేషం.
Also Read : Sridhar Rao : ఈనాడు ఉద్యోగికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?







