Cable Bridge : కేబుల్ బ్రిడ్జ్ లైట్లు దొంగ‌ల పాలు..!

Cable Bridge

Cable Bridge : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఐటీ కారిడార్ కు కేబుల్ బ్రిడ్జ్ మ‌ణిహారం అనేలా ఏర్పాటు చేశారు. ఈ కేబుల్ బ్రిడ్జీ లైటింగ్ కోసం విదేశాల నుంచి ఎల్ఈడీ ప్ర‌త్యేక లైటింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి.. సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకునేవిధంగా చేశారు. ప్ర‌స్తుతం మాత్రం అందుకు భిన్నంగా ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు.Cable Bridge

cable-bridge-lights-taken-by-thieves

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన ఇంపోర్టెడ్ ఎల్ఈడీ లైట్ల స్థానంలో ఫంక్షన్ హాల్ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇంపోర్టెడ్ లైట్లు దొంగ‌లు ఎత్తుకెళ్లార‌ని ప్ర‌భుత్వం.. మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కొత్త లైట్లు జ‌పాన్ నుంచి వ‌స్తాయ‌ని.. తాత్కాలికంగా ఫ్ల‌డ్ లైట్లు ఏర్పాటు చేశామ‌ని అధికారుల వివ‌ర‌ణ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జి లైటింగ్ పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ గా మారాయి. ఇది ఆక‌ర్ష‌ణీయ‌మైన లైటింగ్ వ్య‌వ‌స్థ కాద‌ని.. ఇదేమీ మోసం రా అంటూ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : Brahmanandam: వైసీపీలోకి బ్రహ్మానందం.. జగన్ తో సంచలన మీటింగ్ ?

కేబుల్ బ్రిడ్జి పై ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్ట‌మ్ లో ఉప‌యోగించే లైట్లు జ‌పాన్ నుంచి రావాల‌ని.. ఇప్ప‌టికే టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్తి అయింద‌ని.. లైట్లు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. లైట్లు వ‌చ్చాక య‌దావిధిగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని వివ‌రించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : Naa Anveshana : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈక‌తో స‌మానం..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu