Sridhar Rao : ఈనాడు ఉద్యోగికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?

Sridhar Rao

Sridhar Rao : సాధార‌ణంగా కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియ‌దు. ఈ విష‌యాన్ని చాలా మంది ప‌లు సంద‌ర్బాల్లో చెబుతుంటారు. అది అక్ష‌రాల స‌త్యం. తాజాగా ఓ కార్టూనిస్టూ విష‌యంలో ఇది రుజువు అయింది కూడా. మాజీ కార్టూనిస్ట్ పోచంప‌ల్లి శ్రీధ‌ర్ రావు తెలుగు పాఠ‌కులంద‌రికీ సుప‌రిచిత‌మే. త‌న క‌ళా నైపుణ్యంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దీంతో అత‌నికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి అప్ప‌గించింది. Sridhar Rao

former-cartoonist-sridhar-rao-gets-cabinet-rank

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు గా పోచంప‌ల్లి శ్రీధ‌ర్ రావును నియ‌మిస్తూ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్యామ‌ల‌రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుదీర్ఘ‌కాలం పాటు ఈనాడు పత్రిక‌లో త‌న మార్క్ కార్టూన్ల‌తో అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు. తొలి ఇన్నింగ్స్ కార్టూనిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన శ్రీద‌ర్.. రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించ‌నున్నారు. ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా సేవ‌లు అందిస్తున్నారు. Sridhar Rao

Also Read : Sandhya Case : ‘సంధ్య’ కేసులో ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ ఇచ్చిన కోర్టు

ముఖ్యంగా కేబినెట్ ర్యాంకు హోదాలో శ్రీధ‌ర్ రావు రెండేళ్ల పాటు కొన‌సాగుతార‌ని ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్యామ‌ల‌రావు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ ర్యాంకు హోదా కావ‌డంతో ఆయ‌న‌కు జీత భ‌త్యాలు అల‌వెన్సులు కూడా అదే స్థాయిలో వర్తిస్తాయని వెల్ల‌డించారు ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ శ్యామ‌ల రావు.

Also Read : Y.S.Jagan : టీవీలో చూస్తే మ్యాచ్ క‌న‌ప‌డదా..? కొలంబో వెళ్లాలా..?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu