JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!

JEEVAN REDDY
JEEVAN REDDY
JEEVAN REDDY

JEEVAN REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 25న బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప‌ట్ల జీవ‌న్ రెడ్డి అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు పేర్కొంటున్నారు.

Congress MLC Jeevan Reddy is a big shock for Revanth Reddy

ఇటీవ‌లే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జీవ‌న్ రెడ్డి భేటీ అయిన‌ట్టు స‌మాచారం. పార్టీ మార్పు విష‌యం పై త‌న స‌న్నిహితుల‌తో ఇప్ప‌టికే చ‌ర్చించిన జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ ను వీడ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు జీవ‌న్ రెడ్డి. ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీ వివిధ హోదాల్లో ప‌ని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి బ‌రిలోకి దిగిన జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ అభ్య‌ర్థి సంజ‌య్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అనంత‌రం ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : Pawan Kalyan: చంద్రబాబు సీరియస్? మంత్రుల గైర్హాజరుపై రాజకీయ వర్గాల్లో చర్చ!!

ఎమ్మెల్యే సంజ‌య్ కాంగ్రెస్ లో చేర‌డాన్ని జీవ‌న్ రెడ్డి బ‌హిరంగంగానే వ్య‌తిరేకించారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ వ‌ర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించి.. జీవ‌న్ రెడ్డి వ‌ర్గానికి త‌క్కువ సీట్లు కేటాయించారు. దీంతో జీవ‌న్ రెడ్డి త‌న అనుచ‌రుల‌ను స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దింపారు. ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్.. జీవ‌న్ రెడ్డి మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాల‌ను త‌గ్గించేందుకు మంత్రుల క‌మిటీ రంగంలోకి దిగినా ఇష్యూ ప‌రిష్కారం కావ‌డం లేదు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చైర్మ‌న్ ప‌ద‌వీ కూడా ఎమ్మెల్యే సంజ‌య్ వ‌ర్గానికి ద‌క్క‌డంతో జీవ‌న్ రెడ్డి అస‌హ‌నానికి గుర‌య్యారు. దీంతో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని ప్ర‌చారం జుగుతోంది.

ALSO READ : Revanth Reddy: గ్రేటర్ లో హస్తం జెండా ఎగురవేయడమే టార్గెట్.. రంగంలోకి రేవంత్ టీమ్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu