KETHIREDDY VENKATARAMI REDDY : ఎవడిని వదిలేది లేదు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి నరకమే?

kethireddy Venkat Ramireddy
kethireddy Venkat Ramireddy

KETHIREDDY VENKATARAMI REDDY : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌, ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మినిస్ట‌ర్ నారా లోకేష్ నుద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఓ ట్యూబ్ ఛానెల్ కి ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు సెన్షేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ఒక విష‌యంలో చంద్ర‌బాబుతో పోల్చితే నారా లోకేష్ ను మెచ్చుకోవ‌చ్చు అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కేతిరెడ్డి. KETHIREDDY VENKATARAMI REDDY

FORMER MLA KETHIREDDY VENKATARAMI REDDY SHOULD APPRICIATE NARA LOKESH MORE THAN CHANDRABABU

ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్ పై స్పందించే క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు కేతిరెడ్డి. నారా లోకేష్ రెడ్ బుక్ పాలన చేస్తున్నారు. దానికి బదులుగా జగన్ మూడింతలు చేస్తారని తెలిపారు. "ఒక్క రప్ప రప్పాకే అంతలా భయపడితే ఎలా..? నారా లోకేష్ ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. దానిని పటిష్టంగా, గట్టిగా, మరింత పదునుగా తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీదా ఉంది. రప్ప రప్పా అనే చిన్న పోస్టర్‌కే భయపడితే ఎలా" అంటూ ప‌రోక్షంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.

Also Read : MLA ANIRUDH REDDY : తెలంగాణ‌లో మ‌ళ్లీ సారా దుకాణాలు తెర‌వాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒక విష‌యంలో నారా లోకేష్ ను మెచ్చుకోవాల్సిందే. వాళ్ల నాన్న కంటే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తాడో.. ఏం లేదో తెలియ‌దు కానీ.. తాను చేయాల‌నుకున్న‌ది మాత్రం చేస్తున్నారు. అది రెడ్ బుక్ కావ‌చ్చు. ఇంకోటి కావ‌చ్చు. కొత్త సంప్ర‌దాయాన్న‌ని నిర్మిస్తున్నారు. ఎలాంటి సంప్ర‌దాయం అంటే.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నేర్పిస్తున్నారు. ఇది జ‌గ‌న్ త్వ‌ర‌గా నేర్చుకుంటారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం కావ‌డానికి 30 ఏళ్లు ప‌ట్టింది. జ‌గ‌న్ కు ఏడేళ్లు ప‌ట్టింది.

Also Read : Duvvada-Divvela Madhuri: దమ్ముంటే జాన్వీ కపూర్ పై కేసు పెట్టండి..?