Fuel crisis : థాయ్ లాండ్ లో నాలుగు రోజులే ప‌ని దినాలు..వియ‌త్నాం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్..!

Fuel crisis : ప‌శ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం.. హోర్మ‌జ్ జ‌ల‌సంధిలో త‌లెత్తిన సంక్షోభం ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల‌ను గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. ఇంధ‌న కొర‌త తీవ్ర‌త‌ర‌మైంది. ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. థాయ్ లాండ్, వియ‌త్నాం ప్ర‌భుత్వాలు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆదేశాలు జారీ చేశాయి. Fuel crisis

WORKING DAYS ARE ONLY FOUR DAYS IN THAILAND.. VIETNAM WORK FROM HOME

ముఖ్యంగా ఇంధ‌నం కోసం ప‌శ్చిమాసియా దేశాల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డే వియ‌త్నాం ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం నుంచి పెట్రోల్ ధ‌ర‌లు వియ‌త్నాంలో 32 శాతం, డిజీల్ 56 శాతం, కిరోసిన్ ఏకంగా 80 శాతం పెరిగాయి. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌ను త‌గ్గించి.. ఇంధ‌నాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వ‌ర‌కు ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశం ఇవ్వాల‌ని పారిశ్రామిక‌, వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. Fuel crisis

Also Read : CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

ఇంధ‌న నిల్వ‌ల‌ను భ‌ద్ర ప‌రిచేలా స‌హ‌క‌రించాల‌ని వియ‌త్నాం ప్ర‌ధాని ఫామ్ మిన్ మిన్.. కువైట్, ఖ‌తార్ యూఏఈ దేశాధినేత‌ల‌తో ఫోన్ ద్వారా చ‌ర్చ‌లు జ‌రిపారు. థాయ్ లాండ్ ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ త‌ర‌హా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇంధ‌న వినియోగాన్ని త‌గ్గించేందుకు వారానికి కేవ‌లం నాలుగు రోజులు మాత్ర‌మే వ‌ర్కింగ్ డేస్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా మిగిలిన అన్ని ప్ర‌భుత్వవిభాగాల్లో ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని ఆదేశించింది.


Also Read : ANDHRAPRADESH : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌పంచాయ‌తీల పున‌ర్విభ‌జ‌న‌..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu