CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY
CM REVANTH REDDY

CM REVANTH REDDY : తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా KLSR ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో సాక్ష్యాలు మాయం చేశారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అసహనం వ్య‌క్తం చేశారు. ఈ KLSR కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ, ఇటీవల పూర్తి ఆధారాలతో బయటపెట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

CM REVANTH REDDY IS SACRIFICING GOVERNMENT EMPLOYEES TO PROTECT HIS BENAMI COMPANY

తాను NCLATలో KLSR ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. ఈ నేపథ్యంలో KLSR ఇన్‌ఫ్రాటెక్ యాజమాన్యం తనను చిత్రహింసలు పెడుతుందని, తన 75 ఏళ్ల తల్లిని అరెస్టు తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని హైకోర్టును ఆశ్రయించిన సౌరభ్ అగర్వాల్ అనే హైదరాబాద్ వ్యాపారి. గతంలో చెన్నైకి చెందిన ఒక న్యాయమూర్తిని కూడా KLSR ఇన్‌ఫ్రాటెక్ యాజమాన్యం బెదిరించింది, సదరు న్యాయమూర్తి కోర్టులో తన ఫోన్ చూపించి తనకు వస్తున్న ఒత్తిళ్లను చూపించాడని, అనంతరం అతను కేసు నుండి తప్పుకున్నాడని హైకోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు పిటిషనర్ తరపు న్యాయవాది.

ALSO READ : TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

ఈ నేపథ్యంలో గతంలో KLSR ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు చెందిన 14 డాక్యుమెంట్లు సీజ్ చేశారు కదా, అవన్నీ సాక్ష్యాధారాల్లో లేవు, ఎక్కడున్నాయని KLSR ఇన్‌ఫ్రాటెక్ తరపు న్యాయవాది ప్రశ్నించారు హైకోర్టు చీఫ్ జస్టిస్. 14 డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో, సాక్ష్యాధారాలు మిస్ అవ్వడం ఏంటని సీజే అసహనం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అధికారి తప్పిదం అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా.. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగిపై క్రిమినల్ కేసు నమోదు చేశారా అంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు పొంతన లేని సమాధానం ఇచ్చారు ప్రభుత్వ తరపు న్యాయవాది. కీల‌క‌మైన కేసులో సాక్ష్యాలు ఎలా మాయం అవుతాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టీస్.

ALSO READ : TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం