Pawan Kalyan: ఈ దెబ్బకు గిరిజన ఓటు బ్యాంకు పవన్ సొంతం

పవన్ కల్యాణ్ గిరిజన ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడానికి కీలకమైన అడుగులు వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ఇమేజ్ ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కూడా బలంగా మారుతోంది. పాడేరు, అరకు, మన్యం వంటి ప్రాంతాల్లో జనసేనకు ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా యూత్ భారీగా పార్టీకి కనెక్ట్ అవుతున్నారు. ఇది ఓటు బ్యాంకుగా మారితే జనసేనకు తిరుగు ఉండదన్న టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన గిరిజన ప్రాంతాలనే లక్ష్యంగా వ్యూహాత్మక కార్యాచరణకు రెడీ అవుతోంది. రెండు రకాల వ్యూహాలు పార్టీ రెడీ చేస్తోంది. ఒకటి పవన్ కల్యాణ్ గిరిజన ఓటు బ్యాంకును పెంచుకోవడం. రెండు వైసీపీని మరింత డైల్యూట్ చేయడం. దీని కోసం కేంద్రం నిధులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి కేటాయింపులు చేస్తూ అభివృద్ధి పనులను పరుగులు పెడుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. విద్యుత్ లేని చోట్ల విద్యుత్ అందిస్తున్నారు. ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవన్నీ పవన్ కల్యాణ్ గిరిజన ఓటు బ్యాంకుగా మారేలా కార్యచరణ రూపొందుతోంది. ఆయా ప్రాంతాల్లో వారానికి రెండు రోజులు ఉప ముఖ్యమంత్రి పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నారు.

వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వారిని తిప్పికొట్టే వ్యూహం కూడా ఉంది. ఒకసారి జన ఓటు బ్యాంకు దక్కితే అది వెనక్కి మళ్లేది కాదని జనసేన ఖచ్చితంగా ఉంది. ఈ వ్యూహంతో జనసేన గిరిజన నియోజకవర్గాల్లో బలపడడం ఖాయమన్న అంచనా ఉంది. పవన్ కల్యాణ్ గిరిజన ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడం ఎంతో దూరంలో లేదు.

Share your love