LENIN Rampage: బాక్సాఫీస్ వద్ద అఖిల్ ర్యాంపేజ్.. రెండు రోజుల్లో రూ.37.2 కోట్లు

అఖిల్

లెనిన్ రాంపేజ్ | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అఖిల్ ఊరమాస్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుత థియేటర్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మౌత్ టాక్ లభిస్తోంది. ఆడియన్స్ నుండి వస్తున్న భారీ రెస్పాన్స్‌తో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు మనం ఎంటర్‌ప్రైజెస్‌గా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత అఖిల్‌కు సాలిడ్ కమర్షియల్ హిట్ పడటంతో అక్కినేని అభిమానులు థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ ముగిసేసరికి ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share your love