భారత్‌లో పెళ్లి చేసుకుని విదేశాల్లో విడాకులు తీసుకోవడం అనే ట్రెండ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా విదేశీ కోర్టుల నుంచి విడాకుల డిక్రీలు తీసుకోవడం భారతీయ చట్టాల ప్రకారం చెల్లదని కోర్టు క్లియర్ చేసింది. హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన పెళ్లిని అదే చట్టం ద్వారానే రద్దు చేయాలని, విదేశీ కోర్టుల ఆర్డర్లు ఇక్కడ వర్తించవని జడ్జిలు స్పష్టం చేశారు.
India Marriage Foreign Divorce Rules
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి కేసు విచారణ సమయంలో ఈ విషయం బయటపడింది. 2003లో భారతీయ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఆయన, భార్యతో కలిసి UK వెళ్లాడు. అక్కడ వారికి కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత వారి మధ్య గొడవలు రావడంతో శ్రీధర్‌రెడ్డి సత్తెనపల్లి కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. అది కొట్టివేయడంతో 2014లో UKలోని కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
తన అనుమతి లేకుండా విదేశాల్లో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారంటూ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీధర్‌రెడ్డిపై బిగామీ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కానీ కోర్టు ఆయన వాదనను తోసిపుచ్చింది. భారతీయ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిన పెళ్లిని అదే యాక్ట్ ప్రకారమే రద్దు చేయాలని, విదేశీ కోర్టుల ఉత్తర్వులు ఇక్కడ చెల్లవని జడ్జిలు స్పష్టం చేశారు.
ఈ తీర్పు వల్ల భారత్‌లో పెళ్లి చేసుకుని విదేశాల్లో విడాకులు పొందాలనుకునే వాళ్లకు షాక్ తగిలింది. ఇకపై ఇలా ఈజీగా విడాకులు తీసుకోవడం కుదరదు. భారతీయ కోర్టుల ద్వారానే మొత్తం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఈ కేసు కూడా క్రిమినల్ కేసుగానే కొనసాగుతుందని, శ్రీధర్‌రెడ్డికి కోర్టు ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదని స్పష్టమైంది.





