కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు అని, సైనికుల త్యాగాలను మరిచిపోలేమని ఆయన అన్నారు.
Kargil Vijay Diwas Jagan tributes
1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో మంచు కొండలపై కఠినమైన పరిస్థితుల్లో కూడా వెరవకుండా దేశ సరిహద్దులను కాపాడిన భారత సైనికుల శౌర్యాన్ని జగన్ కొనియాడారు. వారి ధైర్యం, నిబద్ధత పట్ల దేశం రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు.
మన మాతృభూమి రక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని జగన్ తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సైనిక బలానికి, దేశభక్తికి నిదర్శనం అని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.





