తెలంగాణలో అక్రమ కట్టడాలకు చెక్ పెట్టాలనుకున్న హైడ్రా విధానంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు పట్టించుకోకపోవడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యవహారం దారుణంగా ఉందని, కోర్టు మాటలను ఎంతవరకు లెక్క చేయడం లేదని ప్రశ్నించింది. హైడ్రా ప్రారంభం నుంచి దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. సెలవు రోజులు, కోర్టు పని చేయని టైంలో తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి బండ్లు దించడంపై ఇప్పటికే కోర్టు నిప్పులు చెరిగింది.
Hydra: Remove Ranganath immediately
ఇప్పటివరకు రంగనాథ్‌పై 63 కోట్లు పైగా ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయి. వీటన్నింటిని విచారించాల్సిన అవసరం ఉంది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రంగనాథ్ పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజా విషయం ఏంటంటే, మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి కోర్టు ఇప్పటికే కీలక ఆర్డర్లు జారీ చేసింది. ఈ భూముల జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పింది. అయినా హైడ్రా అధికారులు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తమ పని తాము చేశారు.
దీనితో `శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్` కంపెనీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందని ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రతివాదిగా చేర్చారు. దీనిపై పలుమార్లు విచారించిన హైకోర్టు రంగనాథ్ నేరుగా కోర్టుకు రావాలని, వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా, లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. తాను మల్కాజిగిరి భూముల జోలికి వెళ్లలేదని కూడా తెలిపారు.
కానీ ఈ విషయంలో నిజం తెలుసుకోవడానికి కోర్టు అమికస్ క్యూరీ ద్వారా క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుంది. దాన్ని పరిశీలించిన తర్వాత సోమవారం జరిగిన విచారణలో రంగనాథ్ వ్యవహారంపై సీరియస్ అయిన న్యాయమూర్తులు ఆయనకు కోర్టు గురించి ఏమాత్రం లెక్క లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని ఆదేశించింది. ఇది హైడ్రా ఫ్యూచర్ ఆపరేషన్లపై పెద్ద ప్రభావం చూపించబోతుంది.





