
కామెర్లు వస్తే నూనె, మసాలాలు, మాంసం పూర్తిగా మానేయాలని మన దగ్గర చాలా ఏళ్లుగా ఒక నమ్మకం ఉంది. కానీ లివర్ డ్యామేజ్ నుంచి కోలుకోవడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమని, సరైన పోషకాహారం తీసుకోవడం వల్లే త్వరగా రికవరీ అవుతారని నిపుణులు చెబుతున్నారు. హెపటాలజిస్ట్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్, డాక్టర్ స్వప్నిల్ శర్మ వంటి సీనియర్ డాక్టర్లు ఈ విషయంలో పాత అపోహలను పూర్తిగా తోసిపుచ్చారు. కామెర్లు అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక లక్షణం మాత్రమే. అది లివర్ కి సంబంధించినది కావచ్చు లేదా వేరే కారణాల వల్ల రావచ్చు. ఇండియాలో ఎక్కువగా ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వైరల్ హెపటైటిస్ వల్ల కామెర్లు వస్తుంది.
High Protein Liver Recovery Truth
లివర్ డాక్టర్ సిరియాక్ ఫిలిప్స్ తన ట్విట్టర్ థ్రెడ్ లో ఈ మిథ్ ని బ్రేక్ చేశారు. “కామెర్లు వస్తే బోరింగ్ ఫుడ్ తినడం, వేపుళ్ళు పూర్తిగా మానేయడం అనేది సౌత్ ఆసియా కంట్రీస్ లో ఉన్న ఒక పెద్ద భ్రమ. అక్టూవల్ గా, తీవ్రమైన హెపటైటిస్ చాలా వరకు self-limiting, అంటే కొన్ని రోజుల్లోనే దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి ప్రత్యేక treatment అవసరం లేదు. బాడీకి కావాల్సింది మంచి nutrition. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ తినొచ్చు. నా patients కి వేయించిన ఆహారం, పాలవిరుగుడు ప్రోటీన్, చిక్కటి ఫ్రూట్ స్మూతీస్, లీన్ మీట్ ఇలా అన్నిటికీ permission ఇస్తాను. ఇవి పూర్తిగా safe,” అని ఆయన వివరించారు.
డాక్టర్ స్వప్నిల్ శర్మ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. మనం తినే ఆహారం లివర్ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి మరియు కొత్త cells ని బిల్డ్ చేయడానికి చాలా అవసరం. “ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న balanced diet ని ఫాలో అవ్వాలి. పప్పు, చిక్కుళ్ళు, పాలు, గుడ్డు, పన్నీర్ ఇలాంటి వాటి నుంచి ప్రోటీన్ తీసుకోవచ్చు. లివర్ కోలుకుంటున్నప్పుడు, ఇది metabolism మరియు detoxification వంటి కీలక పనులు చేయాలి. సరైన nutrition లేకపోతే రికవరీ ప్రాసెస్ slow అవ్వడమే కాకుండా, కండరాల నష్టం, immunity తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆకలి లేకపోయినా చిన్న చిన్న మీల్స్ తీసుకుంటూ హైడ్రేటెడ్ గా ఉండాలి,” అని డాక్టర్ శర్మ సలహా ఇచ్చారు.
కామెర్లు వచ్చినప్పుడు కొన్ని దూరంగా ఉండాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. లివర్ పూర్తిగా కోలుకునే వరకూ ఆల్కహాల్ కి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. అలాగే, చాలా ఎక్కువ నూనె, డీప్ ఫ్రైడ్, over processed foods వీలైనంత తగ్గించాలి. ఇవి నేరుగా కామెర్లును పెంచకపోయినా, జీర్ణం కావడం కష్టం మరియు వాటి nutritional value చాలా తక్కువగా ఉంటుంది. డాక్టర్ శర్మ చెప్పిన ప్రకారం, అపరిశుభ్రమైన food లేదా contaminated water ని avoid చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాత అపోహల వల్ల food anxiety పెరిగి, జబ్బు నయం కావడానికి మరింత సమయం పడుతుంది. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు కాబట్టి, ఇంటి చిట్కాలు మానేసి డాక్టర్ సలహా ప్రకారం personalized diet తీసుకోవడం చాలా మంచిది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848







