Agadh: ఆగస్ట్‌లో వస్తున్న ఎమ్మెస్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్

ఎమ్మెస్ రాజు తన దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘Agadh’ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ సినిమా ఈ సంవత్సరం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ఎమ్మెస్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైథలాజికల్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని ఎమ్మెస్ రాజు చెప్పారు.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమా విజువల్ వండర్ లాగా ఉంటుందని, టెక్నికల్ పరంగా కూడా హై స్టాండర్డ్స్ ఉంటుందని నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు వివరించారు. ఇందులో సంగీతం రాకేష్ వెంకటపురం, ప్రొడక్షన్ డిజైన్ రాజీవ్ నాయర్ అందిస్తున్నారు.

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ Agadh సినిమాను ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘డర్టీహరి’, ‘మళ్లీపెళ్లి’ వంటి సక్సెస్ సినిమాలు ఇచ్చిన ఎమ్మెస్ రాజు, ఈ సినిమాతో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తున్నారు. ఆగస్ట్ 14న విడుదలయ్యే ఈ సినిమా థియేటర్లలో ఎలా ఉండబోతుందో చూడాలి.

Share your love