
Amla: ప్రకృతి అందించిన అత్యంత విలువైన ఔషధాలలో ఉసిరికాయ ఒకటి. శీతాకాలంలో అత్యధికంగా లభించే ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని గూస్బెర్రీలు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉసిరి పండుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పండుతో అనేక రకాల మందులు తయారు చేస్తారు. ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఒక చిన్న ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి ఒక నారింజ పండుతో సమానం. శరీరానికి విటమిన్ సి చాలా అవసరం ఉసిరికాయను తిన్నట్లయితే శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. Amla
Amazing Health Benefits of Amla
దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఏర్పడిన చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. వైరస్ లు క్రమక్రమంగా క్షీణిస్తాయి. చలికాలంలో శరీరానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. అలాంటివారు ఉసిరికాయను ప్రతిరోజు ఒకటి తిన్నట్లయితే ఇమ్యూనిటీ పుష్కలంగా లభిస్తుంది. శీతాకాలంలో ప్రతిరోజు రెండు ఉసిరికాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి హానికరమైన చెడు బ్యాక్టీరియాలను క్షీణింపచేస్తాయి. Amla
Also Read: Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?
మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ఉసిరికాయ తిన్నట్లయితే చాలా మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమక్రమంగా తగ్గిస్తాయి.కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి. ఉసిరికాయ శరీరంలో రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని, గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఉసిరికాయను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయతో పచ్చడి కూర తయారు చేసుకుంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. Amla
Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు

