Jubilee Hills bypoll: 50 శాతం దాటిన ఓటింగ్‌..ఇక ఆ పార్టీదే విజ‌యం, ఎగ్జిట్స్ పోల్స్ సంచ‌ల‌నం ?

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు నెలన్నర నుంచి అన్ని పార్టీలు అక్కడే కాపు కాసాయి. అయితే నవంబర్ 11వ తేదీన అంటే నిన్నటి రోజున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయింది. నవంబర్ 14వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితం వెలువడనుంది. అయితే నిన్న జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో 50 శాతానికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. Jubilee Hills bypoll

Jubilee Hills bypoll Voting exceeds 50 percent

చరిత్రలో ఇలా 50 శాతానికి పైగా ఓట్లు నమోదు కావడం ఇదే మొదటిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఓటు శాతం పెరిగితే కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని అంచన వేస్తూ ఉంటారు. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ముందు నుంచి చెప్పినట్లుగానే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎన్ని దొంగ ఓట్లు వేసిన, డబ్బులు పంచిన సరే, అక్కడ గులాబీ పార్టీ ఎగర వేయడం గ్యారంటీ అని అటు బిఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. Jubilee Hills bypoll

Also Read: Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

మరి పెరిగిన ఓటు శాతం ఎవరికి కలిసి వస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండ‌గా, కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాల ప్రకటనల కోసం రూ.25 కోట్ల ప్రజల సొమ్ము వృథా చేసిన‌ట్లు బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌చారం చేస్తోంది. న్యూస్ పేపర్లు, న్యూస్ చానళ్లు, ఔట్ డోర్ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఇతరత్రా పబ్లిసిటీ యాడ్స్ కోసం రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్రభుత్వం చేసిన ఖర్చుపై సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేశార‌ట‌ న్యాయవాది మామిడి వేణుగోపాల్. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ బాగోతం బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. Jubilee Hills bypoll

Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు

Share your love