ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి అమిత్ షా ఉప ప్రధాని ప్రమోషన్ గురించి హాట్ టాక్ మొదలైంది. ప్రధాని మోదీ తర్వాత పార్టీలో నంబర్ 2గా ఉన్న అమిత్ షాకు అధికారికంగా డిప్యూటీ పీఎం పదవి రాబోతుందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రమోషన్ త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగమేనని టాక్ వినిపిస్తోంది.
గుజరాత్ లో మోదీ-అమిత్ షా జోడీ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలో కూడా ఈ ఇద్దరు కలిసి దేశాన్ని ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. అమిత్ షాకు ఉన్న సత్తా, నిర్ణయం తీసుకునే సామర్థ్యం చూస్తే ప్రధాని స్థానంలో కూడా వారు చేయగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవడానికి ముందే ఈ ప్రమోషన్ లాంఛనమే అని ఢిల్లీ వర్గాల్లో జోరుగా టాక్ వస్తోంది. అమిత్ షాను ప్రమోట్ చేయడానికి ఇదే సరైన టైమ్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. కొందరికి ఈ పునర్వ్యవస్థీకరణలో డిమోషన్ తప్పదంటే, అమిత్ షాకు మాత్రం ప్రమోషన్ ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి అమిత్ షా అధికారికంగా డిప్యూటీ పీఎం అవ్వడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అనధికారికంగా నంబర్ 2 స్థానంలో ఉన్న అమిత్ షాకు ఇప్పుడు ఆ పదవి అధికారికం కాబోతోంది. ఈ ప్రమోషన్ వల్ల మోదీ ప్రభుత్వంలో మరింత శక్తి సమతుల్యం ఏర్పడుతుందని రాజకీయ నిపుణులు అనలిసిస్ చేస్తున్నారు.





