
Bagara Rice: తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బగార అన్నం విపరీతంగా తింటారు. ఇంట్లో ఏదైనా శుభ కార్యం లేదా ఇతర కార్యక్రమం ఏది జరిగిన కూడా బగార అన్నం తినడం చాలా కామన్. అయితే ఈ బగార అన్నం తినడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బగార అన్నం తినడం వల్ల తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. ఈ బగార అన్నంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి చాలా అవసరం. Bagara Rice
Bagara rice is a tempered rice dish that offers several nutritional benefits
ఇక బగార అన్నం లో వేసే పల్లీలు అలాగే నువ్వులు, కొబ్బరి ముక్కలు శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తాయి. బరువు పెరగకుండా చేస్తాయి. బగార అన్నం తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బగార అన్నంలో దాల్చిన చెక్క, లంగాలు ఉండటం వల్ల, జలుబు దూరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే ఈ బగార అన్నం తినడం వల్ల శరీరానికి పీచు పదార్థం పెద్దగా అందదు. Bagara Rice
Also Read: Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ సపోర్ట్?
దానివల్ల మలబద్ధక సమస్య వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఈ బగార అన్నం విపరీతంగా తినడం వల్ల బిపి పెరుగుతుందని చెబుతున్నారు. బీపీ పెరగడం వల్ల గుండెపోట్లు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అలాగే షుగర్ ఉన్నవాళ్లు కూడా ఈ బగార అన్నం తినకూడదని సూచిస్తున్నారు వైద్యులు. దీనివల్ల డయాబెటిస్ పెరిగే ప్రమాదం ఉందట. అయితే బగార అన్నం ఎప్పుడో ఒకసారి తింటే సరిపోతుంది. కానీ నిత్యం తినకూడదని చెబుతున్నారు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయట. Bagara Rice
Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?




















