వెబ్ సిరీస్ లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది “90s మిడిల్ క్లాస్ బయోపిక్”. మిడిల్ క్లాస్ లైఫ్ ను ఈ వెబ్ సిరీస్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గా “లిటిల్ హార్ట్స్” అనే చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ సినిమాను కంటెంట్ నచ్చి సెప్టెంబర్ 12న థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి. ఈ చిత్రంలో మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటించగా..దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.
“లిటిల్ హార్ట్స్” థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వీడియో హిలేరియస్ గా ఉండి నవ్విస్తోంది. బ్యాగులో పుస్తకాలు తప్ప ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తినేందుకు కొడుకు మౌళి తనూజ్ పెట్టుకున్న డబ్బాలన్నీ చూసి తండ్రి రాజీవ్ కనకాల షాక్ అవుతాడు. బ్యాక్ గ్రౌండ్ లో చదువూ లేదూ సంధ్యా లేదూ..అంటూ సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేసిన సాంగ్ నవ్విస్తోంది. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” లాగే “లిటిల్ హార్ట్స్” మూవీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకోనుంది.





