హీరో వెంకటేష్, దర్శకుడు వీవీ వినాయక్ కలిసి లక్ష్మీ అనే సూపర్ హిట్ మూవీ చేశారు. ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ వీరి కాంబోలో చివరిదాకా వచ్చి మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడీ కాంబో తిరిగి సెట్ అయినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని వెంకటేష్ తో తీసేందుకు వినాయక్ రెడీ అవుతున్నారట. త్వరలో ఈ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది. హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. ఈ చిత్రంతో పాటే వినాయక్ సినిమా కూడా వెంకటేష్ ప్రారంభిస్తారట.





