VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

vijay-rajini
vijay-rajini

VIJAY THALAPATHY : త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు ఈసీ సిద్ధ‌మైంది. ఇదిలా ఉండ‌గానే త‌మిళ‌నాడులో ఓ విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. సినీ న‌టుడు విజ‌య్ ద‌ళ‌ప‌తి కి చెందిన త‌మిళ‌గా వెట్రి క‌జ‌గం సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల‌లోకి రావాల‌ని ఆలోచించిన‌ప్పుడు ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం ఆయ‌న‌ను బెదిరించింద‌ని ఆరోపించారు.

DMK, TVK leader’s comments threatening Rajinikanth are controversial

టీవీకే పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న అధ‌వ్ అర్జున.. మార్చి 12న డీఎంకే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన నిర‌స‌న‌లో స‌భ్యుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. డీఎంకే నేత‌లు, ర‌జినీకాంత్ అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ‌నాడు మాజీ సీఎం ఎం.జీ. రామ‌చంద్రన్ శ‌కం ముగిసిన త‌రువాత ర‌జినీకాంత్ ఓ ప్ర‌జాదార‌ణ పొందిన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎద‌గాల‌ని వ్య‌వ‌స్థాగ‌త మార్పులు తీసుకురావాల‌ని ఆశించారు.

Also Read : PCC CHIEF MAHESH KUMAR : కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ టెస్ట్ కి రావాలి.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

అయితే ఇప్పుడు ర‌జినీకాంత్ రెడ్ జాయింట్ సంస్థ‌తో మూవీస్ చేస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. రెడ్ జాయింట్ సంస్థ స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కి చెందిన‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ర‌జినీకాంత్ ని విమ‌ర్శించ‌డం త‌న ఉద్దేవం కాద‌ని.. విజ‌య్ రాజ‌కీయ ధైర్యాన్ని హైలెట్ చేయ‌డ‌మే త‌న ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో తీవ్ర వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి.

Also Read : తెలుగు జాతి చరిత్రలో నిలిచే అమరావతి విగ్రహావిష్కరణ కార్యక్రమం!!

Share your love