Raj Gopal Reddy : కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

Komatireddy Raj Gopal Reddy
Komatireddy Raj Gopal Reddy

Raj Gopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన ర‌హ‌స్య డిన్నర్ మీటింగ్ కి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌లిగిస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. అయితే వారిలో మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజ‌రైన‌ట్టు స‌మాచారం.

Komatireddy Rajagopal Reddy’s secret dinner meeting which is causing a stir in Congress

కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని భావిస్తూ, కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ రహస్య డిన్నర్ మీటింగ్‌తో రాజకీయ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి జాయినింగ్ వార్త నుంచి కోలుకోకముందే.. ఈ 9 మంది ఎమ్మెల్యేల సమావేశం కాంగ్రెస్‌కు మరో షాక్‌గా మారింది.

ALSO READ : VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

ఈ ర‌హ‌స్య డిన్నర్ స‌మావేశం అనంత‌రం రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌పై ఊహ‌గానాలు మొద‌ల‌య్యాయి. బీఆర్ఎస్ లో జీవ‌న్ రెడ్డి చేరిక వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలోనే ఇప్పుడు ర‌హ‌స్య మీటింగ్ చోటు చేసుకోవ‌డంతో కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు సంకేత‌మా..? లేక పెద్ద రాజ‌కీయ కుదుపున‌కు నాందా..? అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.

ALSO READ : PCC CHIEF MAHESH KUMAR : కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ టెస్ట్ కి రావాలి.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Share your love