
PCC CHIEF MAHESH KUMAR : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాం హౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి పాజిటివ్ నమోదైన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈగల్ బృందం కర్తవ్యాన్ని నెరవేరుస్తోందని తెలిపారు. రాజకీయాలకతీతంగా పని చేస్తుందని వెల్లడించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు పై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలన్నారు. PCC CHIEF MAHESH KUMAR
KTR should also come for drug test. PCC chief’s shocking comments
ప్రజలు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ టీమ్ దాడులు చేస్తోంది. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం అయితే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందం డ్రగ్స్ టెస్టులు చేసుకొని లోపలికి వెళ్దామని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆ దిశగా ప్రయత్నానికి మనవంతు సాయం చేయాలన్నారు.
Also Read : తెలుగు జాతి చరిత్రలో నిలిచే అమరావతి విగ్రహావిష్కరణ కార్యక్రమం!!
పోరాటాన్నే.. నిర్వీర్యం చేసే పని చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ డ్రగ్స్ పార్టీలో 11 మంది ఉన్నన్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి తో సహా కొంత మంది వ్యాపారవేత్తలతో పాటు ఓ మహిళా కూడా పోలీసులకు చిక్కారు. ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్, నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి లకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : PILOT ROHIT REDDY : తెలంగాణలో మరో సంచలనం.. పైలెట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్




