TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

TDP Chandrababu, Devineni Uma

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం అందుతోంది. డబ్బులు తీసుకొని ఘరానా మోసం చేశార‌ట దుండ‌గులు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించారు 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు. నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. TDP

Fake video calls to TDP leaders with photos of Chandrababu, Devineni Uma

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తారని చెపారు దుండగుడు. కాసేపటికి దేవినేని ఉమ మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి, టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని చెప్పాడ‌ట స‌ద‌రు వ్యక్తి. దీంతో రూ.35 వేలు డబ్బును పంపార‌ట‌ సదరు టీడీపీ నాయకుడు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని తెలిపాడ‌ట‌ దుండగుడు. చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో, నిజమని నమ్మారు టీడీపీ నాయకులు. TDP

Also Read: Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి, బీ ఫాం ఇప్పిస్తానని చెప్పడంతో, విజయవాడకు వెళ్లారు 18 మంది టీడీపీ నాయకులు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో, విజయవాడలోని ఒక హోటల్లో బస చేసేందుకు వెళ్లారు నాయకులు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసి, చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు దుండగులు. ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా రంగంలోకి దిగారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకు ఫోన్ చేయగా, తాను ఎవరికి ఫోన్ చేయలేదని స్పష్టం చేయడంతో మోసపోయామని గ్రహించారు బాధితులు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరువే పోతుందని, సైలెంట్‌గా వెనుదిరిగారు తెలంగాణ టీడీపీ నాయకులు. TDP

Also Read: Munaga Chettu: మునగ చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా… ఇక లక్ష్మి దేవి కురిసినట్టే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu