FBI: ఎఫ్‌బీఐ వాంటెడ్ జాబితాలో పంజాబ్ పోలీసు ఆఫీసర్

ఎఫ్‌బీఐ వాంటెడ్ జాబితాలో పంజాబ్ పోలీసు ఆఫీసర్ గురిందర్జీత్ సింగ్ పేరు చేరింది. అమెరికా నిర్వహించిన ఆపరేషన్ హార్డ్ బాల్ లో భాగంగా మొత్తం 37 మంది భారతీయ నేరస్థులను ఈ జాబితాలో చేర్చారు. లారెన్స్ బిష్ణోయ్, భగవాన్‌పురియా వంటి గ్యాంగ్‌స్టర్లు కూడా అందులో ఉన్నారు.

ఈ పోలీసు ఆఫీసర్ అమెరికాలో ఉన్న ఓ బాధిత కుటుంబం నుంచి సుమారు నాలుగు లక్షల డాలర్లు వసూల్ చేసినట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన మీడియా సమావేశంలో యూఎస్ అటార్నీ ఫస్ట్ అసిస్టెంట్ బిల్ ఎస్సేలీ ఈ విషయాన్ని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి, డబ్బు ఇవ్వకపోతే ఇండియాలో వారిపై మర్డర్ కేసు పెడతామని చెప్పారు.

జగ్గూ భగవాన్‌పురి క్రిమినల్ సిండికెట్ కేసులో పంజాబ్ పోలీసు అధికారి ఈ బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. ఎఫ్‌బీఐ సుమారు 37 మంది భారతీయ నేరస్థులపై అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఆ పోలీసు అధికారిని అమెరికాకు అప్పగించాలని కూడా కోరనున్నారు.

ఈ ఎఫ్‌బీఐ వాంటెడ్ జాబితాలో పంజాబ్ పోలీసు ఆఫీసర్ ఉండటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఇండియా-అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Share your love