Vidadala Rajini: వైసీపీకి మాజీ మంత్రి విడదల రజిని గుడ్‌బై ?

Vidadala Rajini

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీకి మరో అగ్ర లీడర్ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన విడదల రజిని సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Vidadala Rajini

Former minister Vidadala Rajini bids farewell to YSRCP

విడదల రజిని పార్టీ మార్పుపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మారి అక్కడ నుంచి పోటీ చేసి విడదల రజిని దారుణంగా ఓడిపోయారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆమెను రేపల్లె నియోజకవర్గానికి వెళ్ళమని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై విడదల రజిని కాస్త అసంతృప్తిగా ఉన్నారట. Vidadala Rajini

Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?

పదే పదే తనను మార్చడం ఏంటని బుంగమూతి పెట్టుకున్నారట విడదల రజిని. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపల్లే నియోజకవర్గానికి తాను వెల్లబోనని విడదల రజిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బాయ్ చెబుతారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై ఇప్పటి వరకు మాజీ మంత్రి రజిని నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. విడదల రజిని తదుపరి నిర్ణయం ఏంటి అనే దాని పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆమె పార్టీ మారితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని చర్చ జరుగుతోంది. Vidadala Rajini

Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్‌…తెర‌పైకి సీపీఐ నారాయణ పేరు ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment