TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, క‌మీష‌న్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?

TDP
TDP

TDP: ఏపీలో కూట‌మి స‌ర్కార్ ఏర్పడిన త‌ర్వాత టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నట్లు అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. భూక‌బ్జా, క‌మీష‌న్ల పేరుతో దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ట కూట‌మి ప్ర‌జా ప్ర‌తినిధులు. అయితే, తాజాగా మ‌రో భాగోతం బ‌య‌ట‌ప‌డింది. నేరుగా టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి కాంట్రాక్ట్ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశార‌ట‌. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. TDP

TDP MLA calls TDP MP directly and demands 10% commission on contract work

అనంతపురం జిల్లా పరిధిలో రూ.7 కోట్ల విలువైన పైప్ లైన్ టెండర్ పనులను టీడీపీ ఎంపీ గుత్తేదారు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఆ గుత్తేదారుకు ఫోన్ చేసి ఆ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక తాను టీడీపీ ఎంపీ మనిషిని అని చెప్పగా.. నేరుగా ఎంపీకే ఫోన్ చేసి కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడుపై కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. TDP

Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?

దీంతో వెంట‌నే ఆ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట స‌ద‌రు ఎంపీ. అధిష్టానానికే ఫిర్యాదు చేస్తావా? ఇక్కడ నేనే అధిష్టానం, నాదే రాజ్యం.. నన్నెవడు ఏం చేయలేడు అంటూ మ‌ళ్లీ రెచ్చిపోయాడ‌ట స‌ద‌రు టీడీపీ ఎమ్మెల్యే. 10% కమిషన్ ఇవ్వకపోతే సామాగ్రిని ఎత్తుకుపోతాం అంటూ బెదిరింపులకు దిగిన‌ట్లు స‌మాచారం. అధికార ఎంపీకే టీడీపీ ఎమ్మెల్యేలతో కమిషన్ల వేదింపులు తప్పలేదని విమర్శలు వ‌స్తున్నాయి. TDP

Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ‌..టీడీపీ కార్యకర్తల దాష్టీకం

Share your love