RS Praveen kumar: BRS పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై?

RS Praveen kumar

RS Praveen kumar: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. హరీష్ రావు అలాగే కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు. కొంతమంది ఆ పార్టీలో ఉండడం కంటే బయటకు రావడమే మేలు అంటూ.. బహిరంగంగానే చెబుతున్నారు. RS Praveen kumar

Big Shock BRS By RS Praveen kumar

మంత్రులు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అని చెప్పేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కొన్నప్ప.. మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన వెంటనే కాంగ్రెస్ గూటికి… వెళ్లడం జరిగింది. అయితే అక్కడే సిర్పూర్ దగ్గర పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… కెసిఆర్ చెంతకు చేరారు. సిర్పూర్ లో తనకు పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. RS Praveen kumar

Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

ఇలాంటి నేపథ్యంలో కోనేరు కొన్నప్ప మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ గులాబీ గూటికి చేరుకున్నారు. హరీష్ రావు అలాగే కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో…. గులాబీ పార్టీలో చేరారు కోనేరు కొన్నప్ప. దింతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలిగినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీకి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. తనకు కచ్చితంగా సిర్పూర్ టికెట్ వస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… అన్ని ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ఇప్పుడు కోనేరు కొన్నప్ప రావడంతో ఆయనకు షాక్ తగిలింది.మరి దీనిపై కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. RS Praveen kumar

Also Read: Dating Apps: డేటింగ్ యాప్ లో ప‌రిచ‌యం..ఇద్ద‌రు అబ్బాయిలు రొ**మాన్స్?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu