
Marriage: దక్షిణ భారతదేశంలో తాళి లేదా తిరుమాంగళ్యం అనే పిలవబడే మంగళసూత్రం ఎంతో ప్రత్యేకమైనది. మంగళసూత్రం పొడవైన పసుపు దారం, లాకెట్టును కలిగి ఉంటుంది. ఇది తరచుగా అదృష్టానికి సంబంధించిన దేవతల చిత్రాలను కలిగి ఉంటుంది. ఇతర ప్రాంతాలలో నల్లపూసలతో కూడిన హారము, బంగారు లాకెట్టు ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా తాళిబొట్టును తయారు చేసుకుంటారు. మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాకుండా సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. హిందూ సాంస్కృతిలో మంగళసూత్రం వివాహంతో ముడిపడి ఉంటుంది. మంగళ సూత్రం ఎన్నో లోతైన విలువలు, నమ్మకాలను కగిలి ఉంటుంది. వివాహ సమయంలో పురుషుడు స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టి మూడు ముళ్ళు వేస్తాడు. Marriage
Why do they put 3 thorns on the bride’s neck Marriage
దీంతో భార్యాభర్తల బంధం బలపడుతుంది. మంగళసూత్రం కేవలం ఆభరణం మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసేదే మంగళసూత్రం. వివాహ సమయంలో పురుషుడు స్త్రీ మెడలో కట్టిన మంగళసూత్రాన్ని జీవితాంతం తన మెడలో అలానే స్త్రీ ఉంచుకుంటుంది. మంగళ సూత్రం రెండు ఆత్మల కలయికను సూచిస్తుంది. ఇది భార్యాభర్తలను కలిసి జీవించేలా చేస్తుంది. హిందూ సంప్రదాయంలో దీనిని తరచుగా వివాహ ప్రమాణాలకు గుర్తుగా ధరిస్తూ ఉంటారు. మంగళ సూత్రంలో నల్లపూసలు ఉంటాయి. ఇలా ధరించడం వల్ల దుష్టశక్తులు దూరం అవుతాయని విశ్వసిస్తారు. ఇది దంపతులు మధ్య ఆనందాన్ని కాపాడుతుందని హిందువులు నమ్ముతూ ఉంటారు. Marriage
Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?
వివాహ సమయంలో మంగళసూత్రం కట్టిన అనంతరం ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. జీవితాంతం కలిసి ఉంటానని వదిలీ వెళ్ళనని ఎల్లప్పుడూ తోడుగానే ఉంటానని ప్రమాణం చేసుకుంటారు. ఇది వైవాహిక బంధం పవిత్రతను నొక్కి చెబుతుంది. దీని కారణంగా వివాహ బంధం నిండు నూరేళ్లు కొనసాగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఒక్కసారి కట్టిన తాలిని స్త్రీ ఎప్పుడు తీయదు. తాళి మెడలో నుంచి తీసినట్లైతే భర్తకు ఆయుక్షిణం కలుగుతుందని భావిస్తారు. తాళి స్త్రీ మెడలో నుంచి తీసి వేసినట్లయితే భర్తకు అశుభం కలుగుతుందని చెబుతారు. ఆ కారణంగానే మెడలో నుంచి తాళిని స్త్రీలు అసలు తీయరు.
Also Read: Dating Apps: డేటింగ్ యాప్ లో పరిచయం..ఇద్దరు అబ్బాయిలు రొ**మాన్స్?




















