Kadiyam Srihari: ఉప ఎన్నికకు రేవంత్ భయపడుతున్నాడు..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు ?

Kadiyam Srihari
Kadiyam Srihari

Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల ఇష్యూ రకరకాల మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన పదిమంది ఎమ్మెల్యేలపై వేటుపడే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ చెబుతోంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు జరిగే ఛాన్సులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari

Kadiyam Srihari comments on by elections in telangana

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట. ఉపఎన్నికకు రేవంత్ భయపడుతున్నాడని…అసెంబ్లీ లాబీ మీడియా చిట్‌చాట్‌లో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసిన‌ట్లు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఉపఎన్నిక వస్తే కేసీఆర్ దెబ్బకి ఓడిపోతామని రాజీనామా చేయవద్దని ఆపారని ఆయ‌న పేర్కొన్న‌ట్లు స‌మాచారం. Kadiyam Srihari

Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

కేసీఆర్ రంగంలోకి దిగితే కాంగ్రెస్ గెలవదనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారని వివ‌రించార‌ట‌. రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నాను భయం లేదు, కానీ అనుమతించట్లేదని క‌డియం వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్‌లో ఉంటూ బీఆర్ఎస్ అని చెప్పడంలో రాజకీయం మాత్రమే ఉందని అన్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత మేర‌కు వాస్త‌వం ఉందో తెలియాల్సి ఉంది. Kadiyam Srihari

Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

Share your love