Harish Rao: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా హరీష్ రావు ?

Harish Rao
Harish Rao

Harish Rao: గులాబీ పార్టీ కీలక నేత, కెసిఆర్ నమ్మిన బంటు హరీష్ రావును దెబ్బతీసే ప్రయత్నాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు పై ఏదో ఒక రకంగా తప్పుడు కథనాలు ప్రచురణ అవుతున్నాయి. మొన్నటి వరకు హరీష్ రావు ను అవమానిస్తూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ ఓడిపోవడానికి, కాలేశ్వరం కుట్ర వెనుక హరీష్ రావు ఉన్నాడని స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడడం పెద్ద దుమారం రేపింది. Harish Rao

sama rammohan reddy comments on Harish Rao

ఇది మరవక ముందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం అనుసరిస్తోంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా హరీష్ రావు బాధితులు తీసుకోబోతున్నాడని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సామ రామ్మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గులాబీ పార్టీపై అనేక రకాల వ్యాఖ్యలు చేసే సామ రామ్మోహన్ రెడ్డి తాజాగా హరీష్ రావును ఉద్దేశించి బాంబు పేల్చారు. Harish Rao

Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజ‌న్‌, ఇక దూకుడే

గులాబీ పార్టీ నుంచి త్వరలోనే హరీష్ రావు బయటకి రాబోతున్నారని పేర్కొన్నారు. ఆయనకు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి స్తారని కూడా అంచనా వేశారు. అదే జరిగితే గులాబీ పార్టీ భూస్థాపితం జరగడం గ్యారంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై హరీష్ రావు అలాగే గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చెల్లెను రూపాయి సామ రామ్మోహన్ రెడ్డి అంటూ పరువు తీస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు దేనికి పనికిరారని, వార్డు కౌన్సిలర్ గా కూడా గెలవలేని రామ్మోహన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటున్నారు. Harish Rao

Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవ‌మానించిన టీడీపీ ?

Share your love