

Anchor Shyamala: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బ్రదర్స్ పోలీసుల ముందు లొంగిపోయిన నేపథ్యంలో టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త నరసింహ అరెస్ట్ అయ్యారు. కాసేపటికి నిజమే వైసిపి పార్టీ ప్రతినిధి శ్యామల భర్త నరసింహను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో కాసేపటి క్రితమే లొంగిపోయిన సంగతి తెలిసిందే. Anchor Shyamala
Anchor Shyamala Husband Narasimha Case arrest
గుల్లపాడు టిడిపి పార్టీ నేతల జంటల హత్య కేసులో ఇద్దరు నాయకులు నిందితులుగా ఉన్నారు. అయితే చాలా రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా దూరంగా రహస్య ప్రాంతంలో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ కోర్టు ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. Anchor Shyamala
Also Read: KCR: కల్వకుంట్ల కవితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్రహం ?
అటు వైసీపీ నేతలను హౌస్ అరెస్టు కూడా చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయిన సందర్భంగా కోర్టు ముందుకు వైసిపి మీడియా ప్రతినిధి శ్యామల వచ్చి రచ్చ చేసారు. అటు శ్యామలతో పాటు ఆమె భర్త నరసింహ కూడా కోర్టు ముందుకు రావడంతో అలర్ట్ అయ్యారు. శ్యామల భర్తను అరెస్టు కూడా చేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. Anchor Shyamala
Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణను అవమానించిన డీకే శివకుమార్ ?





