Revanth Reddy: తెలంగాణ బిజెపి ఎంపీలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశం.. కేవలం ఆ ముగ్గురితోనే చర్చలు ?

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి విడత ఆ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. అలా అని గులాబీ పార్టీకి తక్కువ సీట్లు ఏం రాలేదు. గట్టి పోటీనే ఇచ్చింది కేసీఆర్ పార్టీ. మొదటి విడతలో ఓవరాల్ గా కాంగ్రెస్ 1702 సీట్లు దక్కాయి. ఇందులో ఏకగ్రీవాలతో పాటు గెలిచిన సీట్లు ఉన్నాయి. అటు గులాబీ పార్టీకి 1345 సర్పంచ్ స్థానాలు దక్కాయి. Revanth Reddy

Revanth Reddy met telangana bjp mps

బిజెపి పార్టీ 186 స్థానాల్లో తన ప్రదర్శన కనబరిచింది. ఇండిపెండెంట్ కాండిడేట్లు 524 మంది గెలిచారు. ఈ లెక్కన చూసుకుంటే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రహస్యంగా బిజెపి ఎంపీలతో సమావేశం అయ్యారట. డీకే అరుణ, రఘునందన్ రావు అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డిలతో సీఎం రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Revanth Reddy

Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంక‌ర్ శ్యామల భర్త అరెస్ట్

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ సమావేశంలో ఉన్నాడంటే కచ్చితంగా వీళ్లు నలుగురు కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారా ? లేక అందరు బిజెపిలోనే కొనసాగి కాంగ్రెస్ ను కతం చేస్తారా ? అంటూ గులాబీ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. వీళ్ళ రహస్య సమావేశానికి గల కారణాలను గులాబీ పార్టీ అన్వేషిస్తుంది. త్వరలోనే అసలు బండారం బయటపెడతామని వార్నింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇస్తోంది. అయితే అటు కాంగ్రెస్ నేతలు మాత్రం, దీనిపై పెద్దగా స్పందించడం లేదు. సాధారణంగా పార్లమెంటు సభ్యులతో సమావేశమైనట్లుగానే వాళ్లతో రేవంత్ రెడ్డి సమావేశమైనట్టు చెబుతున్నారు. Revanth Reddy

Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల ప‌రువు తీసిన ప్ర‌ధాని మోడీ…

Share your love