
Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్నాడు శివ ప్రసాద్ అనే వ్యక్తి. కొంత కాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లాడు శివ ప్రసాద్. Tollywood
Case filed against Tollywood producer Bellamkonda Suresh
ఈ తరుణంలోనే, మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించారు బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు. ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపాడు బాధితుడు శివ ప్రసాద్. Tollywood
Also Read: Kranti Gaud: లేడీ బుమ్రా దెబ్బ అదుర్స్.. తండ్రికి మళ్ళీ పోలీస్ జాబ్…!
ఇక శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించాడు బెల్లంకొండ సురేష్. దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేశారు శివ ప్రసాద్. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Tollywood
Also Read: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి.. అసలు మ్యాటర్…





