
Ande Sri: తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ ఇవాళ మరించిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటి తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీకి ఘోర అవమానం ఎదురైంది. తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఇవాళ ఉదయం మృతి చెందారు తెలంగాణ ఉద్యమ కవి అందె శ్రీ. ఇక అందేశ్రీ పార్దివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం లాలాపేట్ జయశంకర్ స్టేడియంకు తరలించారు. Ande Sri
On the day of her death, Ande Sri was subjected to a terrible humiliation
చాలా సేపటి వరకు అంబులెన్స్‌లోనే అందెశ్రీ పార్ధివ దేహం ఉంచేశారు. స్టేడియంలో కనీసం టెంట్ కూడా వేయని పరిస్థితి నెలకొందని బీఆర్ ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఇంత కష్టపడ్డ అందెశ్రీని పేరు మోసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్నో ఉండగా గాంధీ ఆసుపత్రిలో వదిలేశారంటూ విమర్శలు వస్తున్నాయి. Ande Sri
Also Read: CM Revanth Reddy: కుమారీ ఆంటీ చెప్పింది, కానీ రాహుల్, సోనియా శుభాకాంక్షలు చెప్పలేదా…
కాగా ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:20 గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఏడు గంటల 25 నిమిషాలకు మరణించినట్లు ప్రకటించారు డాక్టర్లు. కాగా అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు. Ande Sri
Also Read: Cm Revanth Reddy: రేవంత్ రెడ్డి కుటుంబంలో అంతర్గత గొడవలు… తిరుపతి రెడ్డితో విభేదాలు…





