BRS: కేటీఆర్ ను దింపేందుకు హ‌రీష్ రావు కుట్ర‌లు..ట్రుబుల్ షూట‌ర్ ట్వీట్ వైర‌ల్?

ktr vs harish rao cm revanth reddy comments viral BRS

BRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు లోకల్ బాడీ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. 80 నుంచి 90% సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గులాబీ పార్టీ దాదాపు 4300 సర్పంచులను గెలిపించుకోవడం జరిగింది. BRS

ktr vs harish rao cm revanth reddy comments viral BRS

అంటే 40 శాతం వరకు గులాబీ పార్టీకి రాగా కేవలం కాంగ్రెస్కు 60% వరకు వచ్చింది. అయితే ఈ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు మధ్య గొడవలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఆ పార్టీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదని బాబు పిలిచారు. అందుకే ఆ పదవి నుంచి కేటీఆర్ ను తప్పించేందుకు హరీష్ రావు కుట్రలు పన్నుతున్నాడని బాంబు పేల్చారు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. BRS

Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?

అయితే ఈ వ్యాఖ్యలపై వెంటనే హరీష్ రావు స్పందించారు. గులాబీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అలాగే తనకు ఎలాంటి విభేదాలు లేవని, తాను చనిపోయే వరకు గులాబీ పార్టీ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు హరీష్ రావు. స‌ర్పంచ్ ఎన్నికల్లో ప‌రాభ‌వం ఎదురైన నేప‌థ్యంలో టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు, త‌న‌కు కేటీఆర్‌కు గొడ‌వ‌లు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణం సృష్టిస్తున్న‌ట్లు ఫైర్ అయ్యారు. BRS

Also Read: Tirumala: తెర‌పైకి మ‌రో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu