Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?

Jagan
Jagan
Jagan

Jagan: మెడికల్ కాలేజీలపై మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇవాళ మెడిక‌ల్ కాలేజీల‌పై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. ఆ మెడిక‌ల్‌ కాలేజీలు తీసుకున్న ప్రైవేట్ వ్య‌క్తులు అధికారంలోకి వచ్చిన వెంటనే జైళ్లలో ఉంటారని హెచ్చ‌రించారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుందన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan

Former CM YS Jagan issued a mass warning on medical colleges

చంద్రబాబు చర్మం మందమ‌ని ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. నా చిన్నప్పుడు ఎన్.జనార్ధన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చారు అని ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయ‌న‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని వివ‌రించారు. ఈ రోజు చంద్ర‌బాబుకు సిగ్గులేదో ఇంకొకటి లేదో.. ఏకంగా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేస్తున్నాడని మండిప‌డ్డారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. Jagan

Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘ‌ట‌న‌..తిరుమల శ్రీవారిపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

ఇక అటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేక‌రిస్తున్నారు. వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు వైయస్ జగన్. అటు కోటి 4లక్షల 11వేల 136 పత్రాలు లోక్ భవన్ కు చేరుకోనున్నాయి. రెండు నెలల్లోనే కోటి 4లక్షల 11వేల 136 మంది సంతకాలు సేక‌రించారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలోనూ జనం సంతకాలు చేశారు. Jagan

Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు స‌స్పెండ్‌? ట్వీట్ వైర‌ల్

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu