

Mallu Ravi: ‘క్షమాపణ చెప్పకపోతే.. నిరాహార దీక్షకు కూర్చుంటా’అంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాడు. కొబ్బరికాయ కొట్టే వివాదంలో ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విచిత్ర డిమాండ్ చేయడం జరిగింది. వడ్డేపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు పాల్గొన్నారు. Mallu Ravi
Mallu Ravi on brs mla vijeyudu issue
ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం.. ఎంపీ తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యే విజయుడు కొబ్బరికాయ కొట్టాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడును అడ్డుకున్నారు మల్లు రవి. మాజీ మార్కెట్ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. MLA ఉండగా అతనెలా కొబ్బరికాయ కొడతాడంటూ మల్లు రవిని నిలదీశారు ఎమ్మెల్యే విజయుడు. Mallu Ravi
Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ
కొబ్బరికాయ కొట్టడానికి నువ్వెవడ్రా.. అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై మల్లు రవి దాడి చేసిన సంగతి తెలిసిందే. కానీ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలంటూ కోరుతున్నారట మల్లు రవి. దాడి చేసి కూడా దాడి చేయలేదని అబద్ధాలు చెప్తూ.. క్షమాపణ చెప్పకపోతే దీక్ష కు దిగుతానంటూ వ్యాఖ్యలు చేసినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Mallu Ravi
Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్కో..ఫోటో వైరల్ ?







