Jeevan Reddy: కాంగ్రెస్ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఇజ్జ‌త్ తీసిన జీవ‌న్ రెడ్డి?

Jeevan Reddy framed Jagityala MLA
Jeevan Reddy framed Jagityala MLA

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మేము దేవుని కండువాలు వేసుకున్నామని పార్టీ మారిన నాయకులు చెబుతుంటే.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ లోకి వచ్చి తప్పు చేశామని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను అడ్డంగా ఇరికించాడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Jeevan Reddy framed Jagityala MLA

స్పీకర్ గారికి ఇప్పుడైనా కనిపించడం లేదా? జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాడు అని నిలదీశారు జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా ప్రకటించారు జీవన్ రెడ్డి.

Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ

ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ గులాబీ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అదే గులాబీ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత మీటింగ్కు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఇందులో భాగంగానే గాంధీ భవన్ లో జరిగిన సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చారు. జీవన్ రెడ్డి. ఈ సంఘటన ప్పుడు వివాదంగా మారింది.

Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైర‌ల్‌ ?

Share your love