Nagabandham Story: నాగబంధం కథ ఆలయ నేలమాళిగ నుంచి పుట్టింది!!

తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగ చర్చల నేపథ్యంలో ‘నాగబంధం’ కథ జన్మించిందని దర్శకుడు అభిషేక్ నామా వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విరాట్ కర్ణ కథానాయకుడుగా నటిస్తే, నభా నటేష్ మరియు ఐశ్వర్య మీనన్ కథానాయికలు. కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వివరించారు.

నేలమాళిగ తెరిస్తే అందులో ఏముంటుందనే ఆలోచన నుంచే నాగబంధం కథ రాశానని అభిషేక్ చెప్పారు. కేవలం ఏదైనా హీరో కోసం కాకుండా కథను ముందు రూపొందించుకుని ఆ తర్వాత సరైన నటీనటుల ఎంపిక చేశామని తెలిపారు. విరాట్ కర్ణ జీరో డిగ్రీస్ చలిలో షర్ట్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించి ఎంతగానో కష్టపడ్డాడు. తన విజన్ను తానే డైరెక్ట్ చేసినందుకు సంతృప్తిగా ఉన్నాని అన్నారు. 107 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్కు సిద్ధం చేశామని వివరించారు.

నిజమైన ఆలయంలో షూటింగ్ చేయడానికి అనుమతులు దొరక్కపోవడంతో సెట్స్ వేయడం వల్ల బడ్జెట్ పెరిగినట్లు దర్శకుడు వెల్లడించారు. వందకోట్ల రూపాయల బడ్జెట్ ఊహించినట్లుగా పెరిగింది, కానీ కథను నమ్మిన నిర్మాతలు తగినంత ఫండ్స్ సమకూర్చారు. ప్రస్తుతం అవుట్పుట్ను చూసి నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. జువైద్ మరియు అభి అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం గూస్బంప్స్ ఇస్తుంది.

సాంకేతిక విభాగంలో కెమెరా మరియు వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని, ఈ కుటుంబ చిత్రాన్ని అందరూ కలిసి చూడొచ్చని దర్శకుడు చెప్పారు. సీక్వెల్ చేయడానికి మంచి అవకాశాలున్నాయని ‘నాగబంధం 2’ ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిషేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త కథలతో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share your love