పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను మరుసటి రోజే నిలబెట్టుకున్నారు. హస్తకళ మహోత్సవం వేదిక మీద కళాకారుల ఆరోగ్య సమస్యలు విన్న ఆయన, వెంటనే క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మాటిచ్చిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన ఉపముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్నారు. నరసాపురం లెస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం విశేషం.
నరసాపురంలో 105 మంది లెస్ కళాకారులకు పరీక్షలు చేయగా, 37 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. వారిలో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నాయి. అవసరమైన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స కూడా ఏర్పాటు చేశారు. చిన్న దృష్టి దోషాలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు ఇప్పించారు. సమస్య చెప్పిన మహాలక్ష్మి, అందె లక్ష్మి అనే కళాకారిణులను మరుసటి రోజే శంకర నేత్రాలయకు తరలించి పూర్తి పరీక్షలు చేశారు.
శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ కళాకారులకు వైద్య శిబిరం నిర్వహించారు. అక్కడ ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రతి కళకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయనే అంశాన్ని ఈ శిబిరాలు సూచించాయి. లెస్ కళాకారులలో కంటి సమస్యలు ఎక్కువగా ఉంటే, కలంకారీ కళాకారులకు వేరే రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ అభిప్రాయం ప్రకారం, హస్తకళల పరిరక్షణ అంటే కేవలం కళాకృతులకు market కల్పించడం మాత్రమే కాదు. ఆ కళను సృష్టించే కళాకారుడి ఆరోగ్యం, జీవనోపాధి, social security కూడా కాపాడాలి. మొత్తమీద మాటిచ్చిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.





