జాతర సీన్ తో సంచలనం: ప్రమోద్ పంజుకు నాగార్జున ప్రశంసలు

ప్రమోద్ పంజు అనే కన్నడ నటుడు ప్రస్తుతం తెలుగులో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాలో లెనిన్ ఫ్రెండ్ అయిన వసంత్ పాత్రలో నటించిన ప్రమోద్ పంజు, తన నటనతో అఖిల్ ను కూడా డామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లోని జాతర సీన్ లో ఈ హీరో యాక్టింగ్ అదరగొట్టేసింది, దీన్ని నాగార్జున కూడా ప్రశంసించారు.

నాగార్జున ఇవాళ జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, ఆ జాతర సీన్ చూసి తాను అఖిల్ కి జాగ్రత్త చెప్పానని చెప్పారు. నీకంటే ఎక్కువ పేరు వస్తుంది ఈ ప్రమోద్ కి అని తాను అఖిల్ కి చెప్పానని నాగార్జున వెల్లడించారు. దీంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ కన్నడ నటుడు ఎవరని వెతుకుతున్నారు. ఇంతలోనే ప్రమోద్ పంజు సోషల్ మీడియా ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ప్రమోద్ పంజు గతంలో కన్నడ సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా మెప్పించాడు. ఇప్పటికే రత్నన్ ప్రపంచ సినిమాకు కర్ణాటక స్టేట్ బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్ గెలుచుకున్నాడు. ప్రభాస్ సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్) తమ్ముడు బాచి రాజమన్నార్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో అలరించాడు. ఆ సినిమా అతని తొలి తెలుగు సినిమా కాగా, ఇప్పుడు లెనిన్ తో మరో హిట్ కొట్టాడు.

ప్రమోద్ పంజు నటన చూసిన తర్వాత, లెనిన్ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అంటున్నారు. అఖిల్ లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవడమే కాక, ప్రమోద్ నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ కన్నడ నటుడు తన యాక్టింగ్ టాలెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Share your love