ప్రముఖ దర్శకుడు పూరి జగననాధ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన నానమ్మ మరణించిన విషయాన్ని ఆమె తెలియజేసింది. “ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు?” అంటూ బాధను పంచుకుంది.
Puri Jagannadh Daughter Emotional Post
పవిత్ర ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నానమ్మతో దిగిన ఫోటోను షేర్ చేసింది. “నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ” అంటూ రాసింది. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇక పూరి జగననాధ్ సినిమాల విషయానికి వస్తే, విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలు దీన్ని నిర్మించాయి.
ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. పూరి జగననాధ్ తన ఫ్యామిలీ టైమ్తో పాటు సినిమా వర్క్లో బిజీగా ఉన్నాడు. ఈ విషాదం వల్ల ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు.





