

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరావేగంగా మారిపోతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోగా కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి, నిధులు ఉన్న మేరకు అభివృద్ధి పనులపై ఫోకస్ చేసింది. అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని అడిగి నిధులు తీసుకొచ్చుకుంటుంది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి భారీగానే కేంద్ర నిధులు వస్తున్నాయి. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం భారీ సహాయమే చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారట. కూటమి అక్కడ తిరుగులేని శక్తిగా ఉంది. Jagan
Rahul to Jagan Sharmila wicket down
జగన్ ఒక్కడే కూటమిని ఎదుర్కోవడం కాస్త కష్టమే. కాస్త కూస్తో ఉన్న కాంగ్రెస్ ఓటు శాతం వైసీపీకి ఆడ్ అయితే కచ్చితంగా విజయం వరిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డితో రాహుల్ గాంధీ సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారట. బెంగళూరు వేదికగా డీకే శివకుమార్తో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రాహుల్ గాంధీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. షర్మిలను పక్కకు పెట్టి, మరొకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అనుకుంటున్నారట రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. Jagan
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?
అదే జరిగితే వైసిపి విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు పట్టుకొని చరిత్ర జగన్కు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటే అతనికి బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలా అని చూసుకుంటే మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కెరీర్ క్లోజ్ అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారని చర్చ జరుగుతోంది. మరి ఎన్నికల సమయం వరకు ఏం జరుగుతుందో చూడాలి. Jagan
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?







