Ravi Prakash: రవి ప్రకాష్‌కు కొత్త చిక్కులు.. వారం రోజుల జైలు శిక్ష?

Ravi Prakash
Ravi Prakash

Ravi Prakash: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైర‌ల్ గా మారింది. TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష ప‌డ్డ‌ట్టు న్యూస్ వైర‌ల్ అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్ త‌గిలిన‌ట్లు చెబుతున్నారు. Ravi Prakash

Ravi Prakash A week imprisonment

టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుంచి విత్ డ్రా చేసారని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. వాటికి లెక్కలు చూపలేదని రవి ప్రకాష్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు అయిన‌ట్లు గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Ravi Prakash

Also Read: Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ

అయితే తనపై నమోదైన కేసులో ఈడీ విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో మరో కేసు నమోదు చేసింద‌ట‌ ఈడీ. ఈ కేసుపై విచారణ జరిపి రవి ప్రకాష్‌ను ముద్దాయిగా గుర్తిస్తూ రూ.1,000 ఫైన్ విధించింద‌ట‌ సెషన్స్ కోర్టు. ఫైన్ చెల్లించని పక్షంలో వారం రోజుల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింద‌ట‌ కోర్టు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన న్యూస్ గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Ravi Prakash

Also Read: Telangana: దావోస్‌లో సీఎం రమేష్, గ్రీన్‌కో..ఫోటో వైర‌ల్‌ ?

Share your love