Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం..కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌

Congress
Congress

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపణలు చేయ‌డం జ‌రిగింది. Congress

Congress Old age in Wanaparthi Municipality setback for Congress party

టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని వెల్ల‌డించారు. తీరా ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారని రజిని చందర్ వ్యాఖ్యలు చేశారు. మాది మూడు తరాలుగా కాంగ్రెస్ కుటుంబం.. మా నమ్మకాన్ని పార్టీ వమ్ముచేసిందని నిప్పులు చెరిగారు. అందుకే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నామని తెలిపారు రజిని చందర్. Congress

Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్

ఇక అటు వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు రజిని చందర్. కాగా, గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ​అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో 5 వార్డులు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపొందాయి. ​బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫిషియో ఓటు వేయడంతో అలంపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. Congress

Also Read: Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర‌, బ‌య‌ట‌పెట్టిన కోనేరు కోన‌ప్ప ?

Share your love