Riddhi Kumar: మూడు ఏళ్లుగా ప్రభాస్ ఇచ్చిన చీరను దాచుకున్న హీరోయిన్.. రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రిద్ధి స్పెషల్ అట్రాక్షన్!!

Riddhi Kumar Saree Gift From Prabhas

Riddhi Kumar:రెబల్ స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ భోజనాలే కాదు, పసందైన గిఫ్ట్‌లకు కూడా చిరునామా అని మరోసారి నిరూపితమైంది. ‘The Raja Saab’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటి Riddhi Kumar ధరించిన అందమైన చీర వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. ఈ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ, తాను కట్టుకున్న చీరను ప్రభాస్ స్వయంగా గిఫ్ట్ ఇచ్చారని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

Riddhi Kumar Saree Gift From Prabhas

ఈ విషయమై రిద్ధి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. గతంలో ‘Radhe Shyam’ షూటింగ్ సమయంలో ప్రభాస్ పుట్టినరోజు నాడు రిద్ధి ఆయనకు ఒక పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. శివాజీ సావంత్ రాసిన ‘Mrityunjay’ (మృత్యుంజయ్) పుస్తకాన్ని ఆమె ప్రభాస్‌కు అందజేశారు. మహాభారతంలోని కర్ణుడి గొప్పతనాన్ని వివరించే ఈ పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇవ్వడానికి కారణం.. ఆయనలో ఉన్న దానగుణం, మంచి మనసు కర్ణుడిని పోలి ఉండటమేనని రిద్ధి భావించారు.

రిద్ధి ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు ముగ్ధుడైన ప్రభాస్, ఆమెకు ప్రతిగా ఒక ఖరీదైన, అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను అత్యంత భద్రంగా దాచుకున్న రిద్ధి, సుమారు మూడు సంవత్సరాల తర్వాత తన కెరీర్‌లో మరో కీలక చిత్రమైన ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ధరించి, ప్రభాస్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

కేవలం తన కో-స్టార్స్‌కే కాకుండా, సెట్స్ లో ఉండే ప్రతి ఒక్కరినీ ప్రభాస్ తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారనేది ఇండస్ట్రీ టాక్. రిద్ధి కుమార్ మరియు ప్రభాస్ మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 9న రిలీజ్ కానున్న ‘ది రాజా సాబ్’ లో వీరిద్దరి మధ్య ఉండే సీన్లు ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu