TDP: తెలుగుదేశం పార్టీలో పెను విషాదం

TDP

TDP: తెలుగుదేశం పార్టీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మరణించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పిడతల రామ భూపాల్ రెడ్డి తాజాగా మరణించారు. రామ భూపాల్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆ పార్టీలో పెను విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే రామ భూపాల్ రెడ్డి, హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు చెబుతున్నారు. TDP

tdp former mla Rama Bhupal Reddy died

ఆయన వయసు ప్రస్తుతం 89 సంవత్సరాలు. ఏజ్ పైబడిన నేపథ్యంలో రకరకాల రోగాలు ఆయనను అటాక్ చేశాయట. ఇక చేసేదేమీ లేక వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఇవాళ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే రామ భూపాల్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. అటు నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఆయన సేవను కొనియాడారు. TDP

Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

ఇది ఇలా ఉండగా 1994 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రామ భూపాల్ రెడ్డి. తొలిసారి విజయం అందుకున్న ఆయన ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు క్రమక్రమంగా దూరమయ్యారు. పార్టీ మారకబోయిన రాజకీయ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. ఇక టిడిపి మాజీ ఎమ్మెల్యే రామ భూపాల్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరు లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. TDP

Also Read: KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu